ETV Bharat / state

'కొత్తకోటలో గులాబీ జెండా ఎగరాలి' - 'కొత్తకోటలో గులాబీ జెండా ఎగరాలి'

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని హోంమంత్రి మహమూద్​ అలీ అన్నారు.

wanaparthy trs municipal elections campaign
'కొత్తకోటలో గులాబీ జెండా ఎగరాలి'
author img

By

Published : Jan 15, 2020, 3:31 PM IST

'కొత్తకోటలో గులాబీ జెండా ఎగరాలి'

వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో హోంశాఖ మంత్రి మహమూద్​ అలీ పర్యటించారు. తెరాస అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు.

ఆరేళ్ల కేసీఆర్​ పాలనలో తెలంగాణ.. అభివృద్ధిలో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని ముందంజలో నడిపిస్తున్న కేసీఆర్​కు... మున్సిపల్​ ఎన్నికల విజయాన్ని బహుమతిగా ఇవ్వాలని ప్రజలను కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి కొత్తకోటలో గులాబీ జెండా ఎగురవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి పాల్గొన్నారు.

Intro:వనపర్తి జిల్లా ,కొత్తకోట మున్సిపాలిటీ లో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ మరియు దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

Body:వనపర్తి జిల్లా ,కొత్తకోట మున్సిపాలిటీ లో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ మరియు దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
రాష్ట్రంలో కెసిఆర్ నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని మహమ్మద్ అలీ తెలిపారు.
ఈ అభివృద్ధి కార్యక్రమాలను ,సంక్షేమ కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ 75 సంవత్సరాలు వెనకబాటుకు గురైందని ఈ ఆరు సంవత్సరాలుగా కెసిఆర్ నాయకత్వంలో అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని.... ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.
రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చెసిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానుకగా రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలలో తెలంగాణ జెండా ఎగురవేయాలని కోరారు.
కొత్తకోట మున్సిపాలిటీ లోని 15 వార్డులకు 15 వార్డుల్లో గెలవాలని సూచించారు.
దేవరకద్ర శాసనసభ సభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు అయిన కొత్తకోట మున్సిపాలిటీ 20 కోట్ల నిధులు మంజూరు చేయించుకున్నాం అని... మన ప్రభుత్వం ద్వారా మన మున్సిపాలిటీని ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కారు గుర్తుకు ఓటు వేసి కొత్తకోటలో అన్ని వార్డులలో క్లీన్స్వీప్ చేసి తెరాస జెండా ఎగురవేయాలని కోరారు.

Conclusion:కిట్ నెంబర్ 1269,
పి.నవీన్,
9966071291.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.