గుజరాత్లో గాలిపటాలు ఎగురవేసిన అమిత్ షా - అమిత్ షా సంక్రాంతి
🎬 Watch Now: Feature Video
కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్లో సందడి చేశారు. అహ్మదాబాద్లో భాజపా కార్యకర్తలు, నేతలతో సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆనంద్ నగర్ రోడ్ ప్రాంతంలోని భవనంపైకి ఎక్కి గాలిపటాలు ఎగురవేశారు. ఆయన సతీమణి సోనాల్బెన్ షా, గుజరాత్ భాజపా అధ్యక్షుడు జితు వాఘిని, భాజపా యువ మోర్చా అధ్యక్షుడు రుత్విజ్ పటేల్ అమిత్ షా వెంట ఉన్నారు. అంతకుముందు కాషాయ రంగు బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు అమిత్ షా.