ప్రతి ఆరోగ్య కేంద్రం పరిధిలో వంద మందికి కరోనా టీకా ఇవ్వాలన్న జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. మెుదటి దశలో భాగంగా ఆరోగ్య, అంగన్వాడీ కార్యకర్తలకు టీకా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
జిల్లాలో జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు మినహా ఆరోగ్య కార్యకర్తలందరికీ టీకా ఇస్తున్నామని వైద్యశాఖ అధికారులు తెలిపారు. గత మూడు రోజులుగా నిర్వహిస్తోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున 120 మందికి టీకా పంపిణీ చేయగా.. రెండవ రోజు 207 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రెండు రోజుల్లో వివిధ కారణాలతో 48 మంది అంగన్వాడీ కార్యకర్తలు వ్యాక్సిన్ తీసుకోలేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీపై హైకోర్టులో విచారణ