ETV Bharat / state

'వనపర్తికి గుర్తింపు తెస్తా'

వనపర్తి వేరుశనగ పంటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చేలా కృషి చేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. జిల్లాలో వేరుసెనగ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

వనపర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి
author img

By

Published : Mar 5, 2019, 5:13 PM IST

Updated : Mar 5, 2019, 7:21 PM IST

వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి
వనపర్తి జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్ శాఖామాత్యులు నిరంజన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు నాంది పలికారు. పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో రూ. 1.60 కోట్లతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలోని వడ్డెర సామూహిక భవనాలను ప్రారంభించారు. మండలంలో చేపట్టే రిజర్వాయర్ల ద్వారా లక్ష ఎకరాలకు పైగా నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.

అంతర్జాతీయంగా పేరు తెస్తా

ఆ తరువాత వ్యవసాయ మార్కెట్ యార్డ్​ను పరిశీలించారు. గజ్వేల్, సిద్దిపేటమార్కెట్ యార్డులను తలపించే విధంగా ఆధునికీకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లాలో వేరుసెనగ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు జరుగుతున్న సన్నాహాలను వివరించారు.

గంజి హనుమాన్ టెంపుల్​లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మార్కెట్​ యార్డు​లో హమాలి సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నేతలు మంత్రిని సన్మానించారు.

ఇవీ చూడండి:నారాయణపేట తొలి కలెక్టర్

From: G.Gangadhar, Jagityala
Cell: 9394450193
........
పోటెత్తిన భక్తులు...
యాంకర్
()

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం దుబ్బరాజన్న ఆలయం లో భక్తులు పోటెత్తారు....శివరాత్రి సందర్బంగా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు...పెద్ద సంఖ్యలో భక్తులు రావటం తో స్వామి వారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది....ఈ సందర్బంగా ఆలయం లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు...
Last Updated : Mar 5, 2019, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.