వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని ప్రజలు లాక్డౌన్ను ఉల్లంఘిస్తూ భౌతికదూరం పాటించకుండా రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతుండటంపై జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్భాష ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె అమరచింతకు వెళ్తూ మార్గమధ్యంలో కొత్తకోట పట్టణములో కర్నూల్ రహదారి, ఆంధ్ర బ్యాంక్, మదన్పూర్ రోడ్డులో తెరిచిన దుకాణాలను మూయించటమే కాకుండా.. వాహనదారులను ఆపి వారిపై మండిపడ్డారు.
పని లేకున్నా రోడ్లపైకి ఎందుకొస్తున్నారని, చిన్నచిన్న కారణాలను సాకుగా చూపి బయటకు రావద్దని ఆమె ప్రజలు కోరారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు అర్థం చేసుకుని ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, ఇళ్లల్లో నుంచి ఎవరు బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు అనవసరంగా రోడ్ల పైకి వస్తే పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.