కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని మాజీ మంత్రి, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మహోన్నత స్థానంలో నిలిపేందుకు కార్యకర్తలు, నాయకులు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. 136వ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని వనపర్తి జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఎగరేసి, పార్టీ వ్యవస్థాపకుల చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు.
స్వాతంత్ర్యం సాధించి పెట్టిన ఘనత కాంగ్రెస్‌ది
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలందరిని ఏకతాటిపై నిలిపి.. స్వతంత్రం సాధించి పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. మతసామరస్యంతో బీద, సామాన్య ప్రజల అభ్యున్నతికి పార్టీ ఎన్నో సంస్కరణలు అమలు చేసిందని పేర్కొన్నారు. పార్టీకి మరోసారి మహోన్నత స్థానం అందించేందుకు కార్యకర్తలు, నాయకులు పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు.
మత సామరస్యంపై గొడ్డలి పెట్టు
మతతత్వ భాజపా అధికారంలోకి రావడం మతసామరస్యంపై గొడ్డలి పెట్టని మంత్రి అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత చట్టాల వల్ల దేశంలోని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని విమర్శించారు. ప్రజల తరపున పోరాడతామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: సాగు చట్టాల విషయంలో సీఎం యూటర్న్: బండి సంజయ్