వనపర్తి జిల్లా కలెక్టరేట్లో వాల్మీకి మహర్షి, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వారివురి చిత్రపటాలకి కలెక్టర్ యాస్మిన్ భాష పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా స్థాయి అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.
మంచి మార్పుని స్వీకరించాలి
మనిషిలో మార్పు అనేది సహజమని, అలా వచ్చిన మార్పును స్వీకరించి పట్టుదలతో కష్టపడితే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చని నిరూపించిన వ్యక్తి వాల్మీకి మహర్షి అని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయనలో వచ్చిన మార్పు, పట్టుదలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఉక్కుమనిషి పోరాట పటిమ
పోరాటమే ఊపిరిగా సాగించి దేశ సమగ్రత కోసం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఎంతో శ్రమించారని కలెక్టర్ అన్నారు. నాటి నిజాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం కోసం ఆయన చూపిన ధీరత్వం, తెగింపు అసమాన్యమైనవని కొనియాడారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజుల్లో అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని ఒంటి చేత్తో ఏకం చేసిన మహనీయుడని పేర్కొన్నారు. అటువంటి మహనీయుడిని మనం స్మరించుకోవడం ఎంతో గర్వకారణమని కలెక్టర్ వెల్లడించారు.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు : ఎర్రబెల్లి