వనపర్తి జిల్లా పరిధిలోని బ్యాంకర్లు అందరూ రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ శ్వేతా మహంతి ఆదేశించారు. ధరణి పోర్టల్ ఆధారంగా కొత్త రుణాలు తీసుకునే ప్రతి ఒక్కరికీ రుణాలు అందించాలని సూచించారు. జిల్లాకేంద్రంలోని అన్ని బ్యాంకుల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లలో రుణ మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలను అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: బాలాపూర్ లడ్డూ రికార్డు బద్దలు కొట్టిన ఫిలింనగర్ లడ్డూ...!