ETV Bharat / state

కారుతో పోటిపడి పరిగెత్తిన ఆవు.. తర్వాత ఏమైంది? - వనపర్తిలో కారుతో పోటి పడి పరిగెత్తిన ఆవు

కారుతో ఆవు పోటిపడి పరిగెత్తడం ఎక్కడైనా చుశారా..! అవును ఓ వైపు కారు వేగంగా వెళ్తోంది.. దానిని అనుసరించి ఆవు కూడా పరిగెత్తింది. కారును డ్రైవర్​ ఆపాడు.. ఆవు కూడా ఆగింది. మళ్లీ కారును ప్రారంభించాడు.. ఆవు మళ్లీ వెంబడించింది. ఈ సంఘటన వనపర్తిలో చోటుచేసుకుంది.

The cow with the car and ran at wanaparthy city
కారుతో పోటిపడి పరిగెత్తిన ఆవు.. తర్వాత ఏమైంది?
author img

By

Published : Aug 2, 2020, 7:30 AM IST

Updated : Aug 2, 2020, 7:37 AM IST

వేగంగా పరిగెత్తే కారును ఆవు అడ్డుకునే ప్రయత్నం చేసింది. సుమారు 200 మీటర్లు కారు వెంట పరిగెత్తి అందరి చూపును ఆకర్షించింది. వనపర్తి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వెనకాల ఉన్న రహదారిపై వేగంగా వెళ్తున్న కారును ఆవు అడ్డుకుంది.

ఆవును తప్పించుకుని ముందుకు సాగిన ఆ కారును వదలకుండా అలాగే పరిగెత్తుతూ అనుసరించింది. ఆవును తప్పించుకుందామని కారు డ్రైవర్ పలు ప్రయత్నాలు చేసినా ఆవు మాత్రం పట్టు విడువలేదు. 200 మీటర్ల దూరం వెళ్లాక చేసేది ఏమీ లేక కారును నిలిపివేశాడు. అయినా కారును వదలని ఆవు కారు ముందరే నిల్చుని ఉండిపోయింది. ట్రాఫిక్ జాం అవుతున్న సంగతిని గమనించిన పోలీసులు ఆవును పక్కకు తోలారు.

కారుతో పోటిపడి పరిగెత్తిన ఆవు.. తర్వాత ఏమైంది?

ఇదీ చూడండి : గౌరవప్రదంగా ఆఖరు మజిలీ... వారి సంస్కారానికి సలాం!

Last Updated : Aug 2, 2020, 7:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.