ETV Bharat / state

మా ఊళ్లో బడి కట్టించండి సార్​

ఊరన్నాక గుడి బడి ఉండాలంటారు. ఏరు లేని ఊరు, నీరు లేని ఏరు ఎంత నిరుపయోగమో బడి లేని ఊరు కూడా అంతే ఇబ్బందైనది. నాగరికత ఇంత అభివృద్ధి చెందినా బడి లేని ఊరుందంటే నమ్మలేము. కానీ ఇప్పటికీ ఆ గ్రామంలో బడి లేదు. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన గ్రామస్థులు విసిగి వేసాగి తలో కొంత వేసుకుని రేకులతో బడిని నిర్మించారు. విద్యార్థుల ఇబ్బందులు చూసైనా బడి కట్టించమని వేడుకుంటున్నారు వనపర్తి జిల్లా అమరచింత మండలం కిష్టంపల్లి గ్రామస్థులు.

Students who are struggling
మా ఊళ్లో బడి కట్టించండి సార్​
author img

By

Published : Mar 10, 2020, 7:02 AM IST

మా ఊళ్లో బడి కట్టించండి సార్​

ప్రభుత్వ బడులంటే పిల్లలు పరుగెత్తుకుంటూ రావాలి... సౌకర్యాలను చూసి పిల్లలను చేర్చేందుకు రావాలంటూ చెబుతున్న అధికారులు ఆ ఊరులో బడి లేదన్న విషయమే మరచిపోయారు. కొత్తగా ఊరు ఏర్పాటు చేశారు. అంతటితోనే తమ పనైపోయిందని మిగతా సౌకర్యాలు గాలికొదిలేశారు. భవనం లేని బడిలో నిత్యం పాట్లు పడుతూ చదువును నెట్టుకొస్తున్నారు వనపర్తి జిల్లా అమరచింత మండలం కిష్టంపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు.

కిష్టంపల్లి గ్రామం జూరాల ప్రాజెక్టు ముంపు ప్రాంతం వాసుల కోసం ఏర్పాటు చేసిన గ్రామం. నూతన గ్రామంగా ఏర్పాటై 13ఏళ్లు గడచినా ఇప్పటి వరకూ బడి ఊసెత్తేవారే కరవయ్యారు. గ్రామంలో పాఠశాల నిమిత్తం 2,150 గజాల స్థలం కేటాయించారు. కానీ నిర్మాణం చేపట్టలేదు. అధికారుల చూట్టూ తిరిగి తిరిగి అలసిన గ్రామస్థులు తలోకొంత చందా వేసుకుని రేకులతో తాత్కాలిక భవనం నిర్మించుకున్నారు.

విద్యార్థులున్నారు... భవనమే లేదు

70 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో కనీస వసతులు లేక పిల్లలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తరగతి గదుల్లోకి కప్పలు, పాములు ఇతర కీటకాలు వచ్చేస్తున్నాయంటూ భయాందోళనలకు గురవుతున్నారు. కొత్త భవనం నిర్మిస్తే బడి మానేసిన వారు కూడా తిరిగొస్తారంటున్నారు విద్యార్థులు.

అన్నింటికీ రెండే గదులు

రోజురోజుకూ హాజరు తగ్గిపోవడం, సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడడం వల్ల ఉపాధ్యాయులకు సమస్యగా మారింది. తరగతి గది అనేదే లేని రేకుల షెడ్డులో బడిని నెట్టుకొస్తున్నారు. ఉన్న రెండుగదులనే ప్రధానోపాధ్యాయుని గదిగా, వంట షెడ్డుగా, తరగతి గదిగా, మధ్యాహ్నం భోజనం కోసం వినియోగించుకుంటున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామంలో పాఠశాలను నిర్మించి విద్యార్థుల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపించాలంటూ గ్రామస్థులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. మాకు బడి కట్టించండి సార్​ అంటున్న చిన్నారుల విజ్ఞప్తిని చూసైనా కనికరించండి అంటున్నారు.

ఇదీ చూడండి: రాములోరి కల్యాణానికి ముహూర్తం ఖరారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.