లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పంపిణిీ చేశారు. వనపర్తి నియోజకవర్గంలోని తన నివాసంలో.. వనపర్తి, గోపాల్ పేట్, రేవల్లి, ఖిల్లా గణపురం, శ్రీరంగాపూర్, పెబ్బేరు, మండలాలకు చెందిన 421 మందికి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'పాలమూరు పనులు పరుగెత్తాలి... డిసెంబర్ కల్లా పూర్తి కావాలి'