వనపర్తి జిల్లా అమరచింత మండలం సింగపేట గ్రామ శివారులో ఓ గొర్రెల కాపరి పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పిడుగుపడి కాపరితోపాటు మూడు గొర్రెలు మరణించాయి.
మృతుడు కొంకన్నోని పల్లె గ్రామానికి చెందిన కుర్వ చిన్న అంజలన్నగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని పంచనామా చేశారు.
ఇదీ చూడండి: భాగ్యనగర శివారులో విజృంభిస్తోన్న కరోనా