ETV Bharat / state

గర్భిణీలకు, బాలింతలకు పెద్దన్నయ్య..పౌష్టికాహారం అందిస్తున్న సర్పంచ్ - గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తున్న చిన్నమందడి సర్పంచ్​

గర్భిణిలు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందించే పౌష్టికాహారం ఉదయం పూటకు మాత్రమే పరిమితమవుతోంది. కానీ ఓ గ్రామంలో సర్పంచ్‌ తన సొంత నిధులతో రాత్రివేళల్లోనూ బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఏడాది నుంచి నిరాటంకంగా కొనసాగుతూ.... మంచి ఫలితాలు అందుకుంటున్న ఆ గ్రామంపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

Sarpanch  providing nutritional food to pregnant and lactating womens
గర్భిణీలకు సర్పంచ్​ సాయం
author img

By

Published : Mar 20, 2020, 3:33 PM IST

గర్భిణీలకు, బాలింతలకు పెద్దన్నయ్య..పౌష్టికాహారం అందిస్తున్న సర్పంచ్

రాష్ట్రంలో శిశు మరణాల రేటు తగ్గించాలంటే గర్భవతి సమయం నుంచి శిశువు ఆరు నెలల వరకూ మంచి పౌష్టికాహారం అందించాలి. రక్తహీనత, పౌష్టికాహార లోపం వల్లనే మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కేసీఆర్​ కిట్ సహా అంగన్​వాడీల్లో పౌష్టికాహారం అందిస్తోంది. వనపర్తి జిల్లా పెద్ద మందడి మండలం చిన్నమందడిలో మాత్రం గర్భిణులు, బాలింతల కోసం ప్రత్యేక కార్యక్రమం అమలవుతోంది. అంగన్​వాడీ టీచర్లు అందించే ఆహారంతో.... అదనంగా రోజూ అరకిలో కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను, పప్పులను ఉచితంగా అందిస్తున్నారు. సర్పంచ్ సూర్య చంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో యశోద ఫౌండేషన్ అధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏడాది కాలంగా అమలవుతోంది.

ఇంటివద్దకే పౌష్టికాహారం

పౌష్టికాహారం కోసం మహిళలు అంగన్​వాడీ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా వారి ఇంటికే పంపే సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం తింటే.. రాత్రి భోజనంలో పోషక విలువలున్న ఆహారాన్ని అందిస్తున్నారు. యశోద ఫౌండేషన్ అందించే ఈ ఆహారాన్ని కేవలం గర్భిణిలు, బాలింతలు మాత్రమే తినాలి. శిశువు జన్మించిన ఆరు నెలల వరకూ ఈ పౌష్టికాహారాన్ని ఉచితంగా అందిస్తారు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరగడం వల్ల గర్భస్త శిశువులు ఆరోగ్యంగా ఉంటున్నారని లబ్దిదారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తున్నామని సర్పంచ్ సూర్యచంద్రా రెడ్డి తెలిపారు.

గర్భిణులు, బాలింతల కోసం చిన్నమందడిలో చేస్తున్న కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో అమలు చేస్తే.... శిశు మరణాలను తగ్గించే అవకాశం ఉంటుందని అంతా అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: 'కరోనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.