ETV Bharat / state

మత్స్యకారుల జీవనోపాధికి 'గండి' - fisherman problems

వారంతా మత్స్యకారులు. వారి జీవనోపాధే చేపల వేట. లక్షల్లో పెట్టుబడి పెట్టి చెరువులో చేపలు పెంచారు. సంక్రాంతి తర్వాత చేపలు విక్రయించాలని కమిటీ ఏర్పాటు చేసుకొని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే ఆశలన్నీ అడియాసలయ్యాయి. కష్టపడి పెంచిన చేపలు కళ్ల ముందే గ్రామస్థులు పట్టుకెళ్తుంటే... చెమర్చిన కళ్లతో దీనంగా చూస్తూ ఉండిపోయారు.

మత్స్యకారుల జీవనోపాధికి 'గండి'
మత్స్యకారుల జీవనోపాధికి 'గండి'
author img

By

Published : Dec 31, 2019, 7:40 PM IST

వనపర్తి జిల్లా కొత్తకోట మండంలోని సరళసాగర్ డ్యాంపై ఆధారపడి దాదాపు 600 మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. పెంచిన చేపలు పెద్దయ్యాయి... సంక్రాంతి తర్వాత విక్రయించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇంతలోనే డ్యామ్​ తెగిన వార్త వారి గుండెల్లో పిడుగు పిడినంత పని చేసింది. దీంతో ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. చేపల పెంపకం కోసం దాదాపు మూడు నుంచి నాలుగు లక్షలకు పైగా ఖర్చు చేశారు. డ్యామ్​కు గండి పడి మత్స్య సంపదంతా కొట్టుకుపోవడంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

ఆరుగాలం కష్టపడి పెంచిన చేపలను... నీటి ప్రవాహం చూసేందుకు వచ్చిన ప్రజలు ఎవరికి తోచినట్లు వారు పట్టుకెళ్తుంటే అచేతనంగా చూస్తూ ఉండిపోయారు. చేపల వేటపైనే ఆధాపడి జీవనం గడిపే తమ కుటుంబాలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

మత్స్యకారుల జీవనోపాధికి 'గండి'

ఇదీ చూడండి: తెలంగాణ నూతన సీఎస్​గా సోమేశ్‌ కుమార్‌

Intro:tg_mbnr_09_31_upadi_kolpoina_matsyakarulu_vo_pkg_ts10053
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం లోని సరళ సాగర్ డ్యాం తెగిపోవడంతో డ్యాం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న చుట్టుపక్కల గ్రామాల లో గల మత్స్యకారులు వారి ఉపాధిని కోల్పోయారు
దాదాపు 600 మంది మత్స్యకారులు ఈ డ్యాంలో చేపల వేట చేసుకొని జీవనం గడుపుతున్న మనం ఇలాంటి సందర్భాల్లో డ్యామ్ అకస్మాత్తుగా తెగిపోవటం వలన మత్స్యకారుల కుటుంబాలు వీధిన పడ్డాయి.
గత మూడు సంవత్సరాల కాలంగా డ్యాంలో చేపల పెంపకం చేపట్టామని ఇందుకు దాదాపు మూడు నుంచి నాలుగు లక్షలు ఖర్చు చేశామని సంక్రాంతి పండుగ తర్వాత చేపలు పట్టే విక్రయించేందుకు మత్స్యకారులు అందరూ కమిటీ వేసుకొని తీర్మానం చేసుకున్న కొద్ది రోజుల్లోనే డ్యాంకు గండి పడి మత్స్య సంపద మొత్తం కొట్టుకుపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు
నీటిలో కొట్టుకు పోతున్న చేపలను ప్రవాహం చూసేందుకు వచ్చిన ప్రజలు ఎవరికి తోచినట్లు వారు పట్టుకెళ్తుంది చూస్తూ ఉండిపోవాల్సి నా పరిస్థితి నెలకొందని మత్స్యకారులు వాపోతున్నారు
ప్రభుత్వం స్పందించి మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని చేపల వేట పైనే జీవనం గడిపే తమ కుటుంబాలకు ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు

Body:tg_mbnr_09_31_upadi_kolpoina_matsyakarulu_vo_pkg_ts10053

Conclusion:tg_mbnr_09_31_upadi_kolpoina_matsyakarulu_vo_pkg_ts10053
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.