ETV Bharat / state

కలగానే రోడ్ల విస్తరణ..

పెరుగుతున్న వాహనాల రద్దీతో ఆత్మకూర్​ పట్టణంలోని ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. పాలకులు.. ప్రభుత్వాలు మారుతున్నాయి.. కానీ ఏళ్లుగా రహదారి సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు నేతలు హామీలు ఇవ్వడం.. ఆనక ముఖం చాటేయడం పరిపాటిగా మారింది.

road problems in wanaparthy
కలగానే రోడ్ల విస్తరణ..
author img

By

Published : Jan 18, 2020, 10:53 AM IST

వనపర్తి జిల్లా ఆత్మకూర్​ పట్టణంలో రహదారుల విస్తరణ అమలుకు నోచుకోకపోవడం వల్ల ప్రయాణికులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమ సమస్యకు పరిష్కారం లభించడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టణ కేంద్రంలో ప్రధాన రహదారుల విస్తరణ ప్రక్రియకు 2002లో ప్రతిపాదనలు సిద్ధమై 33 ఫీట్ల మేరకు ప్రధాన రహదారికి ఇరువైపులా ఆక్రమణలు తొలంగించాలని అప్పట్లో ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. వ్యాపారులు తహసీల్దార్ కార్యాలయంలో సమావేశమై తీర్మానాన్ని అంగీకరించారు. ఆర్​అండ్​ బీ సిబ్బంది ఆక్రమణలపై మార్కింగ్ చేశారు.. పనులు ప్రారంభమయ్యేలోపే 2004 ఎన్నికలు వచ్చాయి. అంతే షరా మామూలే.

కలగానే రోడ్ల విస్తరణ..

నిధులు వచ్చినా వాడుకోలేకపోయారు
రహదారుల విస్తరణ ప్రక్రియతో నిమిత్తం లేకుండా 2016లో ఆర్అండ్​బీ శాఖ పట్టణంలో ప్రధాన రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండం వల్ల పట్టణ వాసుల మోములో ఆనందం చిగురించింది. ఎంపీడీవో కార్యాలయం నుంచి భాజపా క్యాంపు వైపు ఉన్న పాత రహదారులను అభివృద్ధి చేశారు. తమకు రోడ్ల గోడు తీరుతుందని భావించిన స్థానికులకు మళ్లీ గడ్డుకాలం ఎదురైంది. సాగర్ నుంచి గాంధీచౌక్ వరకు ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న ప్రధాన కాలువ పనులు సకాలంలో పూర్తి చేయలేదన్న కారణంతో నిధులు వెనక్కి మళ్లాయి. ఫలితంగా మళ్లీ రహదారుల విస్తరణ ఆగిపోయింది.

జూరాల ప్రాజెక్టు సందర్శకులతో ఇబ్బంది
రహదారులకు ఇరువైపుల ఉన్న తోపుడు బండ్లు, చిరు వ్యాపారుల దుకాణాలు.. వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నాయని.. ఫలితంగా అనేక రోడ్డు ప్రమాదాలు ఉత్పన్నమవుతున్నాయని స్థానికులు అంటున్నారు. జూరాల ప్రాజెక్టు వచ్చే సందర్శకుల తాకిడితో పట్టణంలో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. వాహన రద్దీతో నవంబర్ నుంచి జనవరి వరకు వ్యవసాయ ఉత్పత్తులను రాత్రి వేళల్లో మాత్రమే తరలించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇరుకురోడ్లపై రాత్రివేళల్లో సమస్యలు ఎదురవుతున్నాయంటూ రైతులు వాపోతున్నారు.

ఇప్పటి మున్సిపల్​ ఎన్నికల తరువాతనైనా తమకు పరిష్కారం లభించకపోతుందా మా రోడ్ల సమస్య తీరకపోతుందా.. అని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇవీ చూడండి: కేంద్రం చేసింది గుండు సున్నా: కేటీఆర్

Intro:Tg_mbnr_02_21_Eruku_roadlu_pkg_TS10092

కలగానే రహదారుల విస్తరణ......
పెరగనున్న వాహనాల రద్దీ....
ఆత్మకూరు పట్టణంలో తప్పని ఇబ్బందులు..
పాలకులు మారిన...ప్రభుత్వాలు మారినా.... ప్రజల తలరాతను మారడం లేదు అవే కష్టాలు... అవే కన్నీళ్లు ఏళ్లుగా అవే సమస్యలు. పరిష్కారానికి నోచుకోక తప్పని ఇబ్బందులు ఎన్నికల ముందు నేతల హామీలు ఇవ్వడం ఆనక ముఖం చాటేయడం పరిపాటిగా మారింది. ఆత్మకూరు పట్టణంలో రహదారుల విస్తరణ అమలుకు నోచుకోక పోవడంతో ప్రయాణికులు వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయ దిగుబడులు తరలించే రోజుల్లో పట్టణంలో వాహనాల రద్దీ పెరిగి రాకపోకలు స్తంభించి పోతాయి. జూరాల ప్రాజెక్టు వద్ద వరదనీటి కొనసాగినప్పుడు సందర్శకుల తాకిడితో పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుంది. రహదారులకు ఇరువైపుల తోపుడు బండ్లు, చిరువ్యాపారుల దుకాణాలు వాహనాలు రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నాయి.

Body:వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణ కేంద్రంలో ప్రధాన రహదారులు విస్తరణ ప్రక్రియ కు 2002లో ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఈ ప్రక్రియకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న క్రమంలో రెండు నెలలపాటు ఆందోళనలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ఎట్టకేలకు ప్రధాన రహదారుల మధ్య నుంచి ఇరువైపుల 33 ఫీట్ల మేరకు ఆక్రమణలు తొలగించాలని అప్పట్లో మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది వ్యాపారులు తాసిల్దార్ కార్యాలయంలో సమావేశమై తీర్మానాన్ని అంగీకరించారు ఆర్ అండ్ బి సిబ్బంది ఆక్రమణలపై మార్కింగ్ చేశారు.2004 ఎన్నికల అనంతరం ఈ ప్రతిపాదనలు అటకెక్కింది.
రహదారుల విస్తరణ ప్రక్రియతో నిమిత్తం లేకుండా 2016లో ఆర్ అండ్ బి శాఖ పట్టణంలో ప్రధాన రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది ఎంపీడీవో కార్యాలయం నుంచి గాంధీ చౌక్ వరకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి బిజెపి క్యాంపు వైపు ఉన్న పాత రహదారులను సిసి రోడ్లు అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపట్టారు మరోమారు ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి విచారణ చేపట్టిన తర్వాత రహదారులు పనులు అభివృద్ధి పనులు చేయాలని ఆందోళనలు కొనసాగాయి ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు జోక్యం రహదారుల అభివృద్ధి పనులు పూర్తి చేయించారు అయితే సాగర్ నుంచి గాంధీ చౌక్ వరకు ప్రధాన ప్రధాన రహదారికి ఇరువైపుల ప్రధాన కాలువ పనులు సకాలంలో చేపట్టకపోవడంతో నిధులు వెనక్కి మళ్ళాయి. పట్టణంలో వాహనాల రద్దీతో నవంబర్ నుంచి జనవరి వరకు వ్యవసాయ ఉత్పత్తులను రాత్రి వేళల్లో తరలించేందుకు అవకాశం కల్పిస్తున్నారు ట్రాక్టర్ల రాకపోకలతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుంది. దింతో రాత్రి వేళల్లో మాత్రమే తరలించేందుకు అనుమతించడం పై రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.జూరాల ఆయకట్టు గ్రామాల నుంచి పశువుల మేతకు గడ్డిని తరలించే వాహనాలు పట్టణాల మీదుగా వెళ్తున్న సందర్భాల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి.

Conclusion:బైట్స్ :
1) బాల్ రాజ్ ఆత్మకూరు పట్టణవాసి
2) ప్రసాద్ ఆత్మకూర్ పట్టణవాసి
3) అశ్విన్ కుమార్ ఆత్మకూరు పట్టణవాసి.

9959999069,మక్థల్...

గమనిక : దయచేసి జూరాల డ్యాం విజువల్స్ డెస్క్ లో ఉంటే వాడుకోగలరు....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.