ఒకప్పుడు పెళ్లిళ్లంటే.. ఎన్నో హంగు ఆర్భాటాలతో జరుపుకునేవారు. పెళ్లితో ముడిపడే ప్రతి వేడకను అంబరాన్నంటేలా చేసుకునేవారు. కానీ కరోనా వచ్చాక.. అలాంటి ఆలోచనలన్నీ గాల్లో మేడల్లా అనిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని బాలానగర్‌కు చెందిన వీరయ్య కుమారుడు అరుణ్‌కు గురువారం వివాహం నిశ్చయమైంది. అయితే అతని బంధువులు వనపర్తి జిల్లాలో నివసిస్తున్నారు.
లాక్డౌన్ వల్ల అరుణ్ పెళ్లికి వారంతా రాలేని పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడప్పుడే వివాహ ముహూర్తాలు లేనందున అరుణ్ ఇవాళే పరిణయమాడేందుకు నిశ్చయించుకున్నారు. వివాహ వేడుకను అతని బంధువులు వాట్సాప్ వీడియోకాల్ ద్వారా వీక్షించారు. వనపర్తి నుంచే తన కుమారునికి, కోడలికి దీవెనలందించారు.
ఇదీ చదవండి: వేరే ఉపాధి చూసుకుంటున్న భవన నిర్మాణ కార్మికులు