వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో చేపల పెంపకంపై వనపర్తి, గద్వాల జిల్లాల మత్స్యకారులకు ఎమ్పీఈడీఏ ప్రత్యేక సెమినార్ నిర్వహించింది. చేపల కోసం చెరువులను తవ్వే విధానాన్ని రైతులకు వివరించింది. మత్స్య సంపదను అభివృద్ధి చేసుకునేందుకు రైతులు అవలంబించాల్సిన పద్ధతులను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎమ్పీఈడీఏ ఛైర్మన్ శ్రీనివాస్ తెలిపారు.
చేపల్లో త్వరగా అభివృద్ధి చెందే సీడ్స్‌ని గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మత్స్యకారులకు సూచించారు. వనపర్తి జిల్లాలో చేపల పెంపకం బాగా పెరిగిందని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష తెలిపారు. గత ఏడాది 2 కోట్లకు పైగా చేపపిల్లలను జిల్లా పరిధిలోని చెరువులు కుంటల్లో వదిలినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్.. ఏప్రిల్ 1 నుంచి అమలు