వనపర్తి జిల్లా వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి నిరంజన్‌రెడ్డి భూమి పూజ చేశారు. పానుగల్లో రైతు వేదిక, గ్రామ పంచాయతీ భవనం, బస్ షెల్టర్‌ను ఆయన ప్రారంభించారు. వీపనగండ్లలో రూ. 3.5 కోట్ల నిధులతో కడుతున్న 30 పడకల ఆసుపత్రి భవనం, గ్రామపంచాయతీ భవనం, బస్ షెల్టర్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు.
రాష్ట్ర అభివృద్ధి దేశంలోనే ముందుండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చేసేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు మంత్రి తెలిపారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.