ETV Bharat / state

'నేటి యువత గాంధీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి'

గాంధీ కన్న గ్రామ స్వరాజ్యం కలలను సాకారం చేసేందుకు యువత కృషి చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కొడంగల్​ పట్టణంలో నిర్వహించిన గాంధీ జయంతి ఉత్సవాల్లో పాల్గొని.. నివాళులు అర్పించారు.

mla patnam narender reddy paid tribute to mahatma gandhi
'నేటి యువత గాంధీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి'
author img

By

Published : Oct 2, 2020, 10:13 PM IST

నేటితరం యువతీ యువకులు గాంధీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కొడంగల్​ పట్టణంలోని వడ్డెర కాలనీలో నిర్వహించిన గాంధీ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్ముని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కొడంగల్ పట్టణంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు హక్కును ప్రారంభించిన ఆయన.. తన ఓటు హక్కును నమోదు చేసుకున్నారు.

గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గాంధీజీ ఎన్నో కలలు కన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన కలలను నెరవేర్చేందుకు యువత కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎన్నికల్లో డిగ్రీ అర్హత సాధించిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. అనంతరం పట్టణంలోని ప్రజా మరుగుదొడ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ఉషారాణి, కౌన్సిలర్ మధు యాదవ్, బాల్​రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పీవీసీ ఆధార్​కార్డు కోసం వెల్లువెత్తుతున్న ఆన్​లైన్​ దరఖాస్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.