ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో తెగిపోయిన కాలువలను, నష్టపోయిన పంటలను ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి పరిశీలించారు. స్థానిక పరిస్థితులపై సీఎం కేసీఆర్తో చర్చించానని తెలిపారు. కాలువల పునరుద్ధరణ పనులు చేపట్టాలని కోరగా... సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు.
వీపనగండ్ల మండలంలో కల్వరాలలో బీమా-16 ప్యాకేజీ కాలువ తెగిపోయిన ప్రాంతాన్ని సందర్శించిన ఆయన... కాలువ పనులను వెంటనే చేపట్టాలని అధికారులను కోరారు. అనంతరం పొలాల్లోని రైతులతో మాట్లాడి ఏ పంటలు సాగు చేస్తున్నారో తెలుసుకున్నారు. పొలంలోకి దిగి... కాసేపు తానే నాగలి దున్ని విత్తనాలు వేశారు. రైతులకు ఎలాంటి నష్టం లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇదీ చూడండి: నూతన చట్టంతో.. వినియోగదారులకు మరింత బాసట..