ETV Bharat / state

వనపర్తిలో నియంత్రిత సాగుపై అవగాహన

రైతును రాజును చేయాలన్నదే.. ప్రభుత్వ లక్ష్యమని అందుకే రైతుల కోసం ఎన్నో పథకాలు చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన నియంత్రిత సాగు విధానం అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. నియంత్రిత సాగు వల్ల ఎలాంటి లాభమో రైతులకు అవగాహన కల్పించారు.

Ministers Seminar On Government Crop Plan In Wanaparthy District
వనపర్తిలో నియంత్రిత సాగుపై అవగాహన
author img

By

Published : May 29, 2020, 12:50 PM IST

వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన నియంత్రిత వ్యవసాయ సాగు విధానం అవగాహన సదస్సులో మంత్రులు నిరంజన్​ రెడ్డి, వి. శ్రీనివాస్​ గౌడ్​ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్నదని, కరోనా సమయంలో సైతం ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, వాన కాలంలో పంటసాగు కోసం రైతులకు అందించేందుకు ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ప్రతి క్లస్టర్​కు వ్యవసాయ అధికారులను నియమించిందని.. వెంటనే రైతు వేదికలను నిర్మించి ఎరువులు ,విత్తనాలు రైతులకు అందించాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా ను సస్యశ్యామలం చేసే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై త్వరలోనే జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పర్యటించి ప్రణాళిక సిద్ధం చేస్తామని మంత్రి నిరంజన్​ రెడ్డి తెలిపారు.

రైతుబంధు సమితులు సంఘటితమై ఉద్యమిస్తే భవిష్యత్తులో క్లస్టర్ వారిగా ఆ ప్రాంతంలోని ప్రజలకు అవసరమయ్యే వ్యవసాయ పంటలను, ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయవచ్చన్నారు. ప్రతి జిల్లాకు ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్​ ఏర్పాటుతో పాటు, అగ్రికల్చర్ సెజ్, రైతు వేదికలను ప్రభుత్వం నిర్మిస్తున్నదని తెలిపారు. వానకాలంలో మొక్కజొన్న సాగు చేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి రైతుకు రైతుబంధు వస్తుందని.. రెండు నెలల్లో రైతు వేదికల నిర్మాణాలను పూర్తి చేయాలని చెప్పారు .

రైతు వినూత్నంగా ఆలోచిస్తే వ్యవసాయంలో అద్భుతాలు సృష్టించవచ్చని మంత్రి వ్యాఖ్యానించారు. రైతుబంధు పథకాన్ని నూటికి నూరు శాతం అమలు చేస్తామని, తెలంగాణ రైతులను లక్షాధికారులను చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వాన కాలంలో అవసరమైన పంటలు మాత్రమే సాగు చేయాలని ప్రోత్సహిస్తున్నదని, ఇది రైతులు గమనించాలని మంత్రి వి.శ్రీనివాస్​ గౌడ్​ సూచించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు దేవరకద్ర, మక్తల్ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రెడ్డి, జెడ్పీ ఛైర్మన్​ లోకేనాథ రెడ్డి, వైస్ ఛైర్మన్ వామన్ గౌడ్, అనుబంధ శాఖల అధికారులు, వ్యవసాయ అధికారుల తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్​ కోసం మళ్లీ ప్లాస్మా దానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.