ఇటీవల రాష్ట్రంలో కురిసిన వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం పాన్గల్, జమ్మాపూర్, గోప్లాపూర్, దవాజీపల్లి గ్రామాలలో మంత్రి పర్యటించారు. గోప్లాపూర్, దవాజీపల్లి గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జమ్మాపూర్లో పేద ప్రజలకు దాతల సహకారంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. జమ్మాపూర్, పాన్గల్ మండల కేంద్రంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
రాష్ట్రంలో కురిసిన వడగండ్ల వాన వల్ల సుమారు 30 వేల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయ శాఖ సమగ్ర సమాచారం సేకరిస్తోందని చెప్పారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటమో, విపత్తు సహాయ నిధి నుంచి సహకారం అందించడమో, బీమా పథకం కింద కవర్ అయ్యేలా ఉంటే ఏదో ఒక పథకంలో వారికి సహకారం అందించటమో చేస్తామని తెలియజేశారు. తప్పనిసరిగా రైతులు పంట బీమా చేయించుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తోంది: దానం