వనపర్తి జిల్లా వ్యాప్తంగా 120 కొనుగోలు కేంద్రాలు రైతులు ధాన్యం విక్రయించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇవాళ వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో ఆయన పర్యటించారు. అల్వాల చెరువు సమీపంలోని ఎత్తు ప్రాంతాల్లో ఉన్న అన్నదాతలకు సాగునీరు అందించే మోటార్లను, బలిజేపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తెలిపారు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాల ద్వారా 120 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రానున్న కాలంలో పంట మార్పిడిపై రైతులు దృష్టి సారించాలని నిరంజన్ రెడ్డి సూచించారు.
ఇదీ చదవండి: భార్య అసహజ కోరికలు.. తీశాయి భర్త ప్రాణాలు!