ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాల్లో ఆపద వస్తే అధైర్యపడొద్దని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. అలాంటి వారికి భరోసా కల్పించేందుకే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. వనపర్తి నియోజకవర్గ పరిధిలోని 182 మంది లబ్ధిదారులకు రూ.65.38 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. చెక్కులతో పాటు తెలంగాణ సోనా బియ్యం, కందిపప్పు, వివిధ రకాల పండ్లు అందజేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటం వల్ల చెక్కుల పంపిణీ కొంత ఆలస్యమైందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోనూ తెలంగాణ సోనా బియ్యం, కందిపంట సాగుచేయాలని సూచించారు.
ఇదీ చూడండి: అభివృద్ధిలో శాంతిభద్రతల పాత్ర కీలకం: మంత్రి మహమూద్ అలీ