తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యతనిస్తోందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులకు ఉచిత నిరంతర విద్యుత్ అందిస్తోన్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వనపర్తి కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టర్ భవన సముదాయాల పనులను, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను, వ్యవసాయ మార్కెట్ నిర్మాణ పనులను.. కలెక్టర్, ఎస్పీ అపూర్వరావుతో కలిసి పరిశీలించచారు. పదిహేను రోజుల్లోపు నిర్మాణ పనులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల నుంచి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడం తెలంగాణలోనే సాధ్యమైందన్నారు. ఈ వానాకాలంలో అవసరానికి తగ్గట్టు వరి వేసుకొని, మిగతా రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న వాణిజ్య పంటల వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా ఎస్పీ అపూర్వ రావు, ఛైర్మన్ లోకనాథ్ రెడ్డి, రాష్ట్ర దళిత నాయకుడు కోళ్ల వెంకటేశ్, వ్యవసాయ మార్కెట్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు లక్ష్మా రెడ్డి, మహేశ్వర్ రెడ్డి స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆకాశంలో అద్భుతం 'హలో'.. ఈ ఏడాది ఏం జరగనుంది?