రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా పానుగల్ మండలం కిష్టాపూర్‌లో పర్యటించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి రామన్న గుట్ట వద్ద పొలాల్లో తిరిగారు. రిజర్వాయర్ ఏర్పాటు కోసం అవసరమయ్యే భూముల సర్వే నంబర్లను తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు.
రిజర్వాయర్ ఏర్పాటులో రైతుల భూములు పోవని, దాదాపు అటవీ, ప్రభుత్వ భూముల్లోనే రిజర్వాయర్ నిర్మాణం చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. కొన్ని వేల ఎకరాలకు సాగు నీరందించే విధంగా నిర్మిస్తామన్నారు.
- ఇదీ చూడండి : కరోనా ఎఫెక్ట్: రేపు కరీంనగర్లో సీఎం పర్యటన