వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. రెవెన్యూ అధికారులు, ఆర్డీవో, కలెక్టర్ నిత్యం నదీ పరివాహక ప్రాంతాలను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తారని ప్రజలకు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న వరద వల్ల ఎలాంటి ముప్పు లేదని... ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు. వరదల వల్ల తేలు, పాములు వంటి విష ప్రాణులు గ్రామాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రితో పాటు జిల్లా జడ్పీ ఛైర్మన్ లోకనాథ్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: 'బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే ఊరుకోం'