ETV Bharat / state

వనపర్తిలో వైద్యుడు లేని ప్రభుత్వాసుపత్రి - ROGULU

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక కేంద్రాల్లో పేద ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు.  మందులున్నా, వైద్య పరికరాలున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ఇందుకు ప్రధాన కారణం వైద్యుల కొరత.

వనపర్తిలో వైద్యుడు లేని ప్రభుత్వాసుపత్రి
author img

By

Published : Mar 27, 2019, 5:47 AM IST

Updated : Mar 27, 2019, 9:31 AM IST

వనపర్తిలో వైద్యుడు లేని ప్రభుత్వాసుపత్రి
వనపర్తి జిల్లా అమరచింత పట్టణ కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నా రోగులకు ఉపయోగపడడం లేదు. వైద్యులు లేకపోవడం, ఉన్నది ఒకే ఒక్క స్టాఫ్ నర్సు కావడం వల్ల స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణిలు, ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ప్రభుత్వాసుపత్రులు లేకపోవడం వల్ల ఆర్​ఎంపీ వైద్యులపై ఆధారపడుతున్నారు. దీని వల్ల వ్యాధుల తీవ్రత పెరిగి మరణాలకు దారి తీస్తోంది.

ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు సమస్యను విన్నవించినా పట్టించుకోలేదని రోగులు వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వైద్యులను నియమించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చదవండి:హైదరాబాద్​లో ఎన్​డీఆర్​ఎఫ్ మాక్​ డ్రిల్​​

Intro:Tg_mbnr_11_26_Doctorleni_govt_hospital_pkg_C12
వైద్యుడు లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
తీవ్రంగా ఇబ్బంది పడుతున్న గ్రామీణ ప్రజలు.

Body:వనపర్తి జిల్లా అమరచింత పట్టణ కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వైద్యుడు లేని కొరత రోగులకు తీవ్ర ఇబ్బంది పెడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక కేంద్రాల్లో పల్లె ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. ఏడాది కాలంగా వైద్యుడే లేక అమరచింత,పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 14 గ్రామాలు 1 తాండ ఉన్నాయి. 12 గంటల పాటు నడపాల్సిన ఆసుపత్రి డాక్టర్లు లేక ఒకే ఒక్క స్టాఫ్ నర్సు తో నడుస్తుంది దీంతో రోగులు పక్కనే ఉన్న ఆత్మకూరు ఏరియా ఆసుపత్రికి వెళ్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు పలుమార్లు విజ్ఞప్తి చేసిన ఉపయోగం లేకపోయింది. ఇక్కడ రెగ్యులర్ డాక్టర్ పోస్టులుంటే ఒక్కరూ కూడా లేరూ. వైద్యుల కొరత కారణంగా క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది లేకపోవడంతో గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. స్థానికంగా ప్రభుత్వ వైద్యులు లేకపోవడంతో ప్రజలు ఆర్.ఎం.పి వైద్యులపై ఆధారపడవలసి వస్తుంది. కొన్నిసార్లు వ్యాధుల తీవ్రత పెరిగి మరణాల వరకు దారి తీస్తుంది. వైద్యులు లేని కొరత వల్ల రోగులు ప్రభుత్వ ఆసుపత్రికి రాలేని పరిస్థితి ఏర్పడింది. అంబులెన్స్ సేవలు లేక గర్భిణులు, రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Conclusion: ప్రభుత్వ ఆసుపత్రుల పైన గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది అని అమరచింత ప్రాథమిక వైద్యశాలలో స్థిరమైన వైద్యుని నియమించి చాలా మంది రోగుల ఇబ్బందులు తొలగించాలని జిల్లా అధికారులు వెంటనే స్పందించి వీలైనంత త్వరగా వైద్యుని ఏర్పరచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలని అమరచింత పరిసర గ్రామీణ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.

కంట్రిబ్యూటర్: రవీందర్ రెడ్డి, 9959999069.
Last Updated : Mar 27, 2019, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.