వనపర్తి జిల్లా ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో కందులు కొనుగోలు చేయాలంటూ ప్రధాన రహదారిపై రైతుల రాస్తారోకో నిర్వహించారు. యార్డులో నిల్వ ఉంచిన కందులనే కాకుండా మార్కెట్కు తరలించే కందులను కొనుగోలు చేయాలని రైతులు నిరసన వ్యక్తం చేశారు.
దానితో సింగ్విండో సిబ్బందికి, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ అదనుపు కందుల కొనుగోలు గురించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని అధికారులు చెప్పడం వల్ల రైతులు రాస్తారోకోను విరమించారు.
ఇదీ చూడండి: వాగ్దానాలు మరిచిన 'మంత్రిని నిలదీసిన మహిళ'