భార్య బాలింతగా ఉన్న సమయంలో పోషకాహారానికి సంబంధించి భర్తే బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీడీపీఓ లక్ష్మమ్మ అన్నారు. పోషణ పక్షోత్సవాల సందర్భంగా వనపర్తి జిల్లాలోని కొత్తకోట, మదనాపురం మండలాల అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన చేపట్టారు. కుటుంబంలోని పిల్లల పోషణ, భార్య, ఇతర కుటుంబ సభ్యుల విషయంలో భర్త చేదోడువాదోడుగా ఉండాలని సూచించారు. అప్పుడే ఆ కుటుంబంలోని వారంతా సరైన పోషకాహారం అంది ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.
ప్రతి అంగన్వాడీ టీచర్.. గ్రామంలోని గర్భిణీ, బాలింతలు కేంద్రానికి వచ్చి భోజనం చేసేలా కృషి చేయాలన్నారు. చిన్నారులకు, కిశోర బాలికలకు గుడ్లు, బాల అమృతాన్ని పౌష్టికాహారంగా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పోషణ కో-ఆర్డినేటర్ వనజా కుమారి, శేఖర్, సూపర్వైజర్ భారతి, ఉమ్మడి మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : 'వ్యవసాయ అంశాలపై హరీశ్‌రావు చెప్పేవన్నీ అసత్యాలే'