కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు.. పేదలను ఆదుకొనే విధంగా ఉండాలని తెతెదేపా అధ్యక్షులు ఎల్.రమణ డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరులో ఆయన పర్యటించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించాయని రమణ మండిపడ్డారు. కరోనా కారణంగా పేదల బతుకులు దుర్భరంగా మారాయని గుర్తు చేశారు. కూలీలకు జీవనోపాధి కరవైన పరిస్థితి ఏర్పడిందని వివరించారు.
ఎన్‌టీ రామారావు ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందన్నారు రమణ. చంద్రబాబు హాయంలోనే.. హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. ప్రజల శ్రేయస్సు కొరకే పార్టీ కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'ఎన్నికలు ఆపేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించారు'