వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రచారానికి రెండు రోజుల గడువే ఉన్నందు అన్ని పార్టీల ప్రధాన నాయకులు.. ఆయా వార్డుల్లో ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశారు.
తెరాస తరపున దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, భాజపాకు మద్దతుగా నియోజకవర్గ భాధ్యులు పవన్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున మధుసూదన్‌రెడ్డి, బాలమణెమ్మ ప్రచారాన్ని నిర్వహించారు. తమ పార్టీలకు ఓట్లేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఇదీ చూడండి : బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్‌నగర్ కార్పొరేషన్