వనపర్తి జిల్లా శ్రీరంగాపురం సమీపంలోని జూరాల ఎడమ కాలువలో మొసలి లభ్యమైంది. ఉదయం పంట పొలాలకు వెళ్తున్న రైతులకు కాల్వలో మొసలి కనిపించింది. వెంటనే తహసీల్దార్ శాంతిలాల్, ఎస్సై అబ్దుల్ ఖాదర్‌కు సమాచారమిచ్చారు. తహసీల్దార్ సమాచారంతో అటవీ శాఖ అధికారులు వచ్చి మొసలిని బంధించారు.
అటవీ రెేంజ్ అధికారి ఓంకార్, సెక్షన్ ఆఫీసర్ ప్రశాంత్ రెడ్డి, రైతులు, యువకుల సాయంతో మొసలిని బంధించి, జూరాల జలాశయంలో వదిలి పెట్టారు. ఎక్కడైనా మొసళ్లు కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పొలాల వద్ద కాపలా ఉండే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి: మెతుకు సీమను ముద్దాడిన గోదారమ్మ