ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు వనపర్తి జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలో మూడు చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాలిటెక్నిక్ కళాశాల, బాలుర జూనియర్ కళాశాల, బాలికల ఉన్నత పాఠశాలలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి చరవాణులను అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. లెక్కింపు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
ఇవీ చూడండి: లాటరీలో విజయం సాధించిన భాజపా అభ్యర్థి