ETV Bharat / state

హరితహారంలో మొక్కలు చనిపోతే.. మళ్లీ నాటండి: కలెక్టర్ - latest news of vanaparthi

వనపర్తి జిల్లాలోని ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలని కలెక్టర్​ యాస్మిన్​ భాష తెలిపారు. అన్ని వర్గాల వారు కలిసికట్టుగా పనిచేసి హరితహారం కార్యక్రమాన్ని విజయమంతం చేయాలని కోరారు. పట్టణంలోని అటవీ ప్రాంతంలో ఆమె మొక్కలు నాటారు.

collector yasmin bhasha participated haritha haram program in vanaparti
అవి చనిపోతే మళ్లీ నాటండి: కలెక్టర్​ యాస్మిన్​ భాష
author img

By

Published : Jul 9, 2020, 10:08 PM IST

వనపర్తి పట్టణ ఎకో పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతంలో కలెక్టర్ యాస్మిన్ భాష మొక్కలు నాటారు. జిల్లా పరిధిలో 47 లక్షల 65 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

ఈ హరితహారాన్ని గ్రామస్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయి వరకు ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్​ కోరారు. నర్సరీల్లో 70 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎక్కడైనా మొక్కలు చనిపోతే ఆ ప్రాంతాల్లో తిరిగి నాటాలని కలెక్టర్ సూచించారు.

ఇదీ చూడండి: కొవిడ్​ తీవ్రతతో ఛలో శ్రీహరి కోట వాయిదా: నారాయణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.