ETV Bharat / state

దసరాలోపు రైతు వేదికల నిర్మాణాలు పూర్తవ్వాలి: కలెక్టర్​ - wanaparthi district latest news

వనపర్తి జిల్లా ఘనపూర్​ మండలంలో జిల్లా పాలనాధికారి షేక్​ యాస్మిన్​ భాషా పర్యటించారు. ఆయా గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికల పనులను పరిశీలించారు. దసరాలోపు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.

collector Sheikh Yasmin Bhasha visited the Ghanpur zone
దసరాలోపు రైతు వేదికల నిర్మాణాలు పూర్తవ్వాలి: కలెక్టర్​
author img

By

Published : Oct 20, 2020, 9:47 PM IST

ఈనెల 24 నాటికి జిల్లాలో చేపట్టిన అన్ని రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లా ఘనపూర్​ మండలంలోని పలు వ్యవసాయ క్లస్టర్లలో చేపట్టిన రైతు వేదికల నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ముందుగా అంకూరు రైతు వేదికను తనిఖీ చేసిన కలెక్టర్.. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఘనపురం మండలం సోలిపూర్, మానాజీపేట, సల్కేలాపూర్, పర్వతాపూర్, అప్పరెడ్డిపల్లెల్లో రైతు వేదికలను పరిశీలించారు.

రూఫ్ స్థాయిలో ఉన్న రైతు వేదికలన్నింటినీ వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మానాజీపేట, సల్కేలాపూర్ రైతు వేదికల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అన్ని రైతు వేదికలను ఈనెల 24లోపు పూర్తి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు. దసరా నాటికి రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని గుర్తు చేశారు. కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శివ కుమార్, ఆర్.అండ్.బి. అసిస్టెంట్ ఇంజినీర్లు తదితరులు ఉన్నారు.

ఇదీ చూడండి.. ఆస్తుల వివరాలను ధరణిలో నమోదు చేయించిన ఎమ్మెల్యే కోనప్ప

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.