వనపర్తి జిల్లా అనపర్తి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ అపూర్వ రావు ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ధ్రువపత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో 70 మంది పోలీసు సిబ్బంది ఆరు విభాగాలుగా ఏర్పడి ఈ తనిఖీలను చేపట్టారు. కాలనీ వాసులకు ప్రభుత్వ వ్యతిరేక చర్యలు, బాల్య వివాహాలాంటి వాటిపై అవగాహన కల్పించారు.
యువతపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పట్టణంలో ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు తిరిగినా, సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ సృజన సూచించారు.
ఇవీ చూడండి : ఫీవర్ ఆస్పత్రికి బారులు తీరుతున్న రోగులు