వనపర్తి జిల్లా కేంద్రంలో నూతన పంచాయతీరాజ్ చట్టం విధివిధానాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వనపర్తి, నాగర్‌కర్నూలు, గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని ఛైర్మన్లు, కౌన్సిలర్లకు పంచాయతీరాజ్ శాఖ కమిషనరేట్ నుంచి వచ్చిన అధికారి చట్టం పనితీరుపై అవగాహన కల్పించారు.
వ్యక్తిగత అభివృద్ధి కోసం కాకుండా ప్రజా సేవలో భాగంగానే పట్టణాల్లో ప్రగతి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. ప్రజాప్రతినిధులపై ప్రభుత్వ పరంగా తీసుకునే కఠిన చర్యలను ఉంటాయని చెబుతూ ప్రతి అధికారి జాగ్రత్తగా మసులు కోవాలని సూచించారు.
ఇదీ చదవండి : 4వ తరగతి పాసైన బామ్మలకు.. నారీశక్తి పురస్కారం