వనపర్తి జిల్లా ఖిలా ఘణపురం మండలం శాగపూర్ స్టేజీ వద్ద ఆటో బోల్తా పడి 20 మందికి గాయాలయ్యాయి. ఖిల్లా ఘణపురం మండలం కమాలుద్దీన్పూర్ నుంచి అదే మండలంలోని ఉప్పర్పల్లి గ్రామంలోని తమ బంధువుల వివాహానికి వెళ్లి వస్తుండగా శాగాపూర్ స్టేజ్ వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఇందులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అతివేగమే ప్రమాదానికి కారణమని పలువురు తెలిపారు.
ఇవీ చూడండి: రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి