మద్యం తాగొద్దని తండ్రి మందలించినందుకు ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వనపర్తి పట్టణానికి చెందిన వంశీతేజ 15 రోజులుగా మద్యం తాగి ఇంటికి వస్తున్నాడు. తండ్రి లక్ష్మీనారాయణతో గొడవపడుతున్నాడు. సోమవారం రాత్రి కూడా మద్యం తాగి ఇంటికి రాగా... భయపడిన లక్ష్మీనారాయణ తన భార్యతో కలిసి పట్టణంలోని శంకర్‌గంజ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు.
మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు ఇంటికి వచ్చి చూడగా... వంశీతేజ ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే బంధువులు, చుట్టు పక్కల వారికి సమాచారం ఇవ్వగా... వంశీతేజను కిందకు దింపారు. కానీ అప్పటికే వంశీతేజ మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వంశీతేజ వనపర్తి పట్టణంలో జరిగిన ఓ హత్యా ఘటనలో నిందితుడని పోలీసులు పేర్కొన్నారు.