ETV Bharat / state

Sonu Sood: సోనూసూద్ కోసం ముంబయికి యువకుడి పాదయాత్ర

author img

By

Published : Jun 9, 2021, 10:39 AM IST

కరోనా కాలంలో ఎంతోమందికి ఆపన్నహస్తం అందించిన సోనూసూద్​ను కలవడానికి ఓ యువకుడు పాదయాత్ర ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా నుంచి ముంబయికి కాలినడకన పయనమయ్యారు. మంగళవారం నాడు అతడు మహారాష్ట్రలోని సోలాపూర్​ చేరుకోగా... అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. సోనూసూద్ సాయం కోసమే ఈ పాదయాత్ర చేస్తున్నట్లు ఆ యువకుడు వెల్లడించారు.

sonu sood, sonu sood fan walking to mumbai
సోనూసూద్​ అభిమాని పాదయాత్ర, వికారాబాద్ నుంచి ముంబయికి పాదయాత్ర

సినీనటుడు సోనూసూద్​ను కలవడానికి వికారాబాద్​ నుంచి ముంబయికి ఓ యువకుడు పాదయాత్ర ప్రారంభించారు. సోనూసూద్​ సాయం కోసం ముంబయికి ఏకంగా కాలినడకన పయనమయ్యారు. మంగళవారం నాడు సోలాపూర్ చేరుకున్నారు. వికారాబాద్ జిల్లా డోర్నపల్లికి చెందిన వెంకటేశ్ జూన్ 1న తన పాదయాత్రను ప్రారంభించారు. ఈఎంఐ కట్టలేకపోవడం వల్ల తన తండ్రి ఆటోను ఫైనాన్స్ కంపెనీ సీజ్ చేసిందని వెంకటేశ్ తెలిపారు. తమ వాహనాన్ని తిరిగిపొందడానికి సోనూసూద్ సాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే కాలినడకన వెళ్తున్నట్లు పేర్కొన్నారు.

వికారాబాద్ జిల్లా నుంచి జూన్ 1న పాదయాత్ర ప్రారంభించిన వెంకటేశ్ ఎనిమిది రోజుల్లో 400 కి.మీలు పూర్తి చేశారు. మంగళవారం నాటికి సోలాపూర్​ చేరుకోగా... అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. రోజుకు 14 కి.మీ చొప్పున నడుస్తున్నట్లు వెల్లడించారు. రాత్రి వేళల్లో గుళ్లు, సత్రాల్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు. ముంబయికి చేరడానికి మరో 400 కిలోమీటర్లకు పైగా నడవాల్సి ఉంది. రియల్ హీరో సోనూసూద్ తమకు సాయం చేస్తారని వెంకటేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: కన్నతల్లి కర్కశత్వం.. కుమారున్ని కొట్టి చంపిన వైనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.