వికారాబాద్ జిల్లా పరిధిలో మూడు అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, రెండు జిల్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నారాయణ తెలిపారు. మంగళవారం నుంచి నిత్యావసర దుకాణాలు, పెట్రోల్ బంక్‌లు ఉదయం 6 నుంచి ఉదయం 9 గంటల వరకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమాల్లో కరోనాపై తప్పుడు పోస్టులు పెడితే కేసు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. తాండూరులో తప్పుడు పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. ఒక వ్యక్తి 3 కిలోమీటర్ల కంటే అధికంగా ప్రయాణం చేసినా కేసులు నమోదు చేస్తామన్నారు. లాక్ డౌన్‌కు అందరూ సహకరించాలని ఎస్పీ నారాయణ కోరారు.
ఇదీ చూడండి: 'లాక్డౌన్'ను ఉల్లంఘిస్తే 6 నెలలు జైల్లో గడపాల్సిందే!