అమెరికాలోని చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వికారాబాద్‌కు చెందిన దంత వైద్యుడు అర్షద్ మహ్మద్ శుక్రవారం మృతి చెందాడు. వికారాబాద్‌కు చెందిన మహ్మద్ ఆజం, మైమునాబేగంలు విశ్రాంత ఉద్యోగులు. వీరి మూడో కుమారుడు అర్షద్ వికారాబాద్‌లోనే బీడీఎస్ పూర్తి చేశాడు. 2014లో అమెరికా వెళ్ళి ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో డీఎండీ పూర్తి చేశాడు. అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్థోడెంటిస్ట్ అవార్డు, అలెన్ సి.పీటర్సన్ స్కాలర్ షిప్ పొందారు. అక్కడే దంత వైద్యునిగా స్థిరపడ్డారు. కుమారుని మరణ వార్త విని తల్లిదండ్రులు చికాగోకు పయనమయ్యారు.
ఇవీ చూడండి:'వికారాబాద్‌లో రన్ ఫర్ ఓట్ కార్యక్రమం'