ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం ఉన్నందున.. పోలీస్ ఉద్యోగాన్ని దేవుడు ఇచ్చిన వరంలా భావించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ పేర్కొన్నారు. జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన మొదటి బ్యాచ్ మొబిలైజేషన్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. నెలరోజులపాటు ఆర్మూడ్ పోలీస్ అధికారులలో నూతన ఉత్తేజం తీసుకోరావడానికి మొబిలైజేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
పోలీస్ అధికారులకు ప్రాథమిక శిక్షణలో ఇచ్చినటువంటి పరేడ్, ఫైరింగ్, లాఠీ డ్రిల్, మబ్ ఆపరేషన్ డ్రిల్, ఇండోర్ తరగతులు మొదలగు అంశాల పట్ల మళ్లీ శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అధికారులు కొత్త విషయాలు నేర్చుకుని.. తమ విధులను సక్రమంగా నిర్వహించి వికారాబాద్ జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్కు మంచి పేరు తీసుకోరావాలని కోరారు.
అనంతరం పోలీస్ వాహనాలు నిలుపుకోవడానికి వీలుగా పరేడ్ గ్రౌండ్లో షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అదనపు ఎస్పీ ఎంఏ రశీద్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:80.5 లక్షల టీకా డోసుల పంపిణీ: కేంద్రం