సభలో గందరగోళం:
తనను ఎంపీగా గెలిపిస్తే.. అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని రంజిత్ రెడ్డి హామీ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని మాటిచ్చారు. రంజిత్ రెడ్డి సమావేశానికి వచ్చే విషయం తమకు చెప్పలేదని మోమిన్‌పేట మండలం ఎన్కతల గ్రామ కార్యకర్తలు గొడవకు దిగారు. కార్యకర్తలకు, నేతలకు మధ్య వాగ్వాదం జరిగి సభలో కాసేపు గందరగోళం నెలకొంది.
ఇవీ చూడండి: అఖండ మెజార్టీ ఇవ్వండి: కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి