వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించనివారికి గులాబీ పూలు ఇచ్చి, పాటించిన వారికి సినిమా టికెట్లను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నారాయణ పాల్గొన్నారు.
వాహనదారులంతా శిరస్త్రాణం ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, అతివేగంతో వాహనాలు నడిపి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని సూచించారు.
ఇవీ చూడండి: 'రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గళమెత్తండి'