వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పొలాల వద్ద కట్టేసిన లేగదూడలను పులి చంపుతోంది. తాజాగా మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన మాన్ సింగ్ నాయక్ అనే రైతు లేగదూడపై చిరుత తీవ్ర దాడి చేసింది. కుల్కచర్ల మండలంలోని ఏదో ఓ గ్రామ శివారుల్లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. ఫలితంగా భయాందోళనకు గురవుతోన్న స్థానిక రైతులు, జనాలు ఊరి పొలాలకు వెళ్ళేందుకు జంకుతున్నారు. ఎలాగైనా చిరుతను బంధించి తమతోపాటు మూగ జీవాల ప్రాణాలు కాపాడాలని అటవీ శాఖ అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.
'మాతోపాటు మూగ జీవాల ప్రాణాలు కాపాడండి'
ఓ చిరుత రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో చోటు చేసుకుంది. చిరుత వరుస దాడుల నేపథ్యంలో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో తమకు పులి బారి నుంచి రక్షణ కల్పించాలని అటవీ శాఖకు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.