వికారాబాద్లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని చిలుకూరు ఆలయం వద్ద హరితహారం మొక్కల్ని మేకలు తిన్నాయి. సమాచారం అందుకున్న చిలుకూరు పంచాయతీ కార్యదర్శి కఠిన నిర్ణయం తీసుకున్నారు. సదరు మేకల యజమానికి 500 రూపాయల జరిమానా విధించారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది.
ఇదీ చూడండి: మిషన్ భగీరథ స్ఫూర్తితో... హరిత ఉద్యమం