వికారాబాద్ జిల్లా ధారూరు మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన గోనెల రాములుకు 20 ఆవులున్నాయి. రోజువారిలాగే పశువులను మేతకు తీసుకెళ్ళి సాయంత్రం ఇంటికి తోలుకొచ్చాడు. కొంత సయమం తర్వాత పది ఆవులు కిందపడి చనిపోయాయి. మరో ఐదు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రాణంగా చూసుకుంటున్న ఆవులు ఎందుకు చనిపోతున్నాయో తెలియక యజమాని ఆందోళనకు గురయ్యాడు. తనకు ఆవులే జీవనాధారమని, తనను ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.
ఇదీ చూడండి: ఇంకొంత కాలం లాక్డౌన్ కొనసాగిస్తే మనం సేఫ్ : కేసీఆర్