ETV Bharat / state

ఇవాళ వికారాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్

CM KCR Visits Vikarabad ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పలు చోట్ల పర్యటిస్తూ బిజీబిజీగా ఉండనున్నారు. ఉదయం 11 గంటలకు కేసీఆర్ హైదరాబాద్ అబిడ్స్‌లో పర్యటించనున్నారు. అక్కడ సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లా కేంద్రానికి బయలుదేరుతారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

CM KCR Visits Vikarabad
CM KCR Visits Vikarabad
author img

By

Published : Aug 16, 2022, 8:00 AM IST

CM KCR Visits Vikarabad వికారాబాద్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ ప్రారంభించనున్నారు. మెడికల్‌ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు. తెరాస కార్యాలయాన్ని కూడా కేసీఆర్‌ ప్రారంభిస్తారు. 61 కోట్ల రూపాయల వ్యయంతో.. సకల సౌకర్యాలతో కొత్త కలెక్టరేట్‌ను ప్రభుత్వం నిర్మించింది. మొత్తం 42 విభాగాలు ఇక్కడ నుంచి పనిచేయనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమాల అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొనున్నారు. ఇందుకోసం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా శాసనసభ్యులు ఏర్పాట్లు చేశారు. సీఎం సభకు భారీగా తరలిరావాలని ప్రజల్ని కోరారు.

CM KCR Visits Abids అంతకంటే ముందు కేసీఆర్ హైదరాబాద్ అబిడ్స్‌లో పర్యటిస్తారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా నేడు ఆబిడ్స్‌ జీపీవో కూడలి వద్ద నిర్వహించనున్న సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఆబిడ్స్ జీపీఓ సర్కిల్, నెక్లెస్ రోడ్డు కూడలి ప్రాంతాల్లో ఏర్పాట్లను సీఎస్ సోమేష్ కుమార్, ఉన్నతాధికారులు పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. జీపీవో సర్కిల్ వద్ద స్వాతంత్య్ర సమరయోధుల చిత్ర పటాలు, రంగుల బ్యానర్లు మైకులు ఏర్పాటు చేయాలని అధికారులకు సోమేష్ కుమార్ ఆదేశించారు.

ఆ సమయంలో రెడ్ సిగ్నల్.. ఈ కార్యక్రమం కోసం ట్రాఫిక్‌ పోలీసులు ఇవాళ ఉదయం పదకొండున్నరకు అన్ని కూడళ్ల వద్ద రెడ్‌ సిగ్నల్ వచ్చేలా ఏర్పాటు చేయనున్నారు. జాతీయ గీతాలాపన ముగిసే వరకు వాహనాలన్ని కూడళ్ల వద్ద నిలిపివేయనున్నారు. వాహనదారులతో పాటు ట్రాఫిక్ పోలీసులూ జాతీయగీతాన్ని ఆలపించనున్నారు. సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ నియమాలను చెప్పేందుకు ఏర్పాటు చేసిన మైకుల్లోనూ జాతీయ గీతం వినిపించనున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ సంయుక్త సీపీ రంగనాథ్ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అధికారులకు సూచనలు చేశారు. సామూహిక జాతీయ గీతాలాపన ముగిసిన తర్వాత వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిగ్నళ్లను నిర్వహించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.